ధోనీకి ఆ అవసరం లేదు: వార్న్

0
29

మ్యాచ్‌లు గెలిపించే సామర్థ్యం ధోనీలో ఉందని, ఇప్పుడతను కొత్తగా ఎవరి దగ్గర నిరూపించుకోవాల్సిన అవసరం లేదని ఆస్ట్రేలియా మాజీ స్పిన్ దిగ్గజం షేన్‌వార్న్ అన్నాడు. ఈ ఐపీఎల్‌లో ధోనీ పేలవ ఫామ్‌పై సామాజిక మాధ్యమాల్లో చర్చ జరుగుతున్న నేపథ్యంలో వార్న్ అతనికి మద్దతుగా నిలిచాడు. ధోనీ అన్ని ఫార్మాట్లకు అతికినట్లు సరిపోయే అద్భుత ఆటగాడు. స్ఫూర్తినిచ్చే గొప్ప సారథి. ఎన్నోసార్లు జట్టుకు విజయాలు అందించాడు. ఇప్పుడు కొత్తగా అతను నిరూపించుకోవాల్సిన అగత్యం లేదు అని వార్న్ ట్విట్టర్లో ప్రశంసించాడు. ఈ ఐపీఎల్‌లో ఇప్పటివరకు 5 మ్యాచ్‌లాడిన ధోనీ 87 ైస్ట్రెక్‌రేట్‌తో 67 పరుగులు మాత్రమే చేశాడు.

LEAVE A REPLY