ధాన్యం నగదును రైతులకు సకాలంలో చెల్లించాలి

0
14

‘ఎన్నికలకు ముందు ఎన్నో వాగ్దానాలు.. అధికారంలోకి వచ్చాక వాటిని అమలుచేయడంలో తీవ్ర వైఫల్యం.. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితమైంది..’ అని టీ-టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మద్దినేని స్వర్ణకుమారి, జిల్లా పార్టీ అధ్యక్షుడు తుళ్లూరి బ్రహ్మయ్య ఆరోపించారు. రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపుమేరకు జిల్లాపార్టీ ఆధ్వర్యంలో ఖమ్మం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. ఆరుగాలం శ్రమించి పంటలు పండిస్తే, ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో నానాకొర్రీలు పెట్టిందని ఆరోపించారు. అటోఇటో చేసి ధాన్యాన్ని విక్రయిసే, 24గంటల్లో చెల్లింపులు చేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం 24రోజులు అవుతున్నా.. ఇప్పటికీ రైతులకు చెల్లింపులు చేయలేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది రూపాయలను ప్రభుత్వం చెల్లించాల్సి ఉందన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here