ధర్నాలు, రాస్తారోకోలతో సమస్యలు తీరవు: పరిటాల

0
13

ధర్నాలు, రాస్తారోకోలతొ సమస్యలు తీరని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. బుధవారం అనంతపురంలో విలేకరులతో మాట్లాడుతూ… అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. అంగన్‌వాడీలు ధర్నాలు, రాస్తారోకోలు చేయడం వల్ల సమస్యలు తీరవని, సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని మంత్రి పేర్కొన్నారు. నవంబర్‌ 2016 నుంచి మార్చి 2017 వరకు ఉన్న వేతన బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలు మే 1 నుంచి 15 వరకు, సహాయకులకు మే 15 నుంచి 31 వరకు వేసవి సెలవులు ఇస్తున్నట్లు మంత్రి సునీత తెలిపారు.

LEAVE A REPLY