ద‌ర్శ‌కుడి కుమారుడిపై డ్రంక్ అండ్ డ్రైవ్‌ కేసు!

0
8

ప్ర‌ముఖ త‌మిళ ద‌ర్శ‌కుడు భార‌తీ రాజా ఇప్పటికే పలు వివాదాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయ‌న కుమారుడు మ‌నోజ్ డ్రంక్ డ్రైవ్‌లో ప‌ట్టుబ‌డ‌టం భారతీ రాజాకు మరో తలనొప్పిని తెచ్చిపెట్టింది. నూగ‌బాకం పోలీస్ స్టేష‌న్ పరిధిలో శుక్ర‌వారం రాత్రి పోలీసులు నిర్వ‌హించిన డ్రంకెన్ అండ్ డ్రైవ్‌లో మ‌నోజ్ ప‌ట్టుబ‌డ్డాడు. బిఎండ‌బ్ల్యూ కారులో వ‌చ్చిన ఆయనను మద్యం మ‌త్తులో ఉన్న‌ట్టు గుర్తించిన పోలీసులు ప‌రీక్ష‌లు చేయగా తాగినట్లు వచ్చింది.

LEAVE A REPLY