దోపిడీదారులు హాయిగా ఉన్నారు

0
32

పెద్దనోట్ల రద్దు నిర్ణయంపై జనసేనాధిపతి పవన్‌ కల్యాణ్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘మిస్టర్‌ ఉర్జిత పటేల్‌’ అంటూ ఆర్బీఐ గవర్నర్‌ను ట్విట్టర్‌లో దునుమాడారు. ‘చచ్చిపోతున్న జనం సాక్షిగా మీరూ, మీ బాస్‌లు హాయిగా నిద్రపోండి’ అని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ ప్రస్తావన తేకుండా… ఉర్జిత పటేల్‌ పేరు మాత్రమే పదేపదే ప్రస్తావించారు. ‘‘మిస్టర్‌ ఉర్జిత పటేల్‌, ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి పేరు బాలరాజు. ఆయనది కర్నూలు జిల్లా! మీరు ‘బాగా ఆలోచించి’ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయానికి బలైపోయిన వందలాదిమంది బాధితుల్లో ఒకరు’’ అంటూ పవన్‌ తన వ్యాఖ్యలు మొదలుపెట్టారు. ‘‘స్వాతంత్య్రం వచ్చి 69 ఏళ్లు గడిచినా… మనుషుల మలమూత్రాలను మనుషులే (మాన్యువల్‌ స్కావెంజింగ్‌) శుభ్రం చేస్తున్న దేశం మనది. మరి ఇప్పుడు… ఇలాంటి దేశంలో ‘నగదు రహిత ఆర్థిక వ్యవస్థ’ సాధ్యమేనని మీరు చెబితే, మేం నమ్మాలి!’’ అంటూ ఎద్దేవా చేశారు. ‘‘మీరు తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయం కోట్లాదిమంది భారతీయుల జీవితాలను అతలాకుతలం చేసింది. అసహాయులు, అమాయకులు కిలోమీటర్ల పొడవునా ఉన్న క్యూలలో నిలబడి చస్తుండగా… ఈ దేశ సంపదను దోచుకున్న ‘మొదటిరకం స్కౌండ్రల్స్‌’ మాత్రం హాయిగా నోట్లు మార్చుకుంటున్నారు. చలామణిలో ఉన్న కరెన్సీలో 86% మీ బ్యాంకుల్లో డిపాజిట్‌ అయ్యాయని మీరు ఆనందంతో ఎగిరి గంతులేస్తుంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here