దేశ వ్యాప్తంగా బీజేపీపై ఎదురుగాలి : ఆర్థిక మంత్రి యనమల

0
7

నాలుగేళ్ల బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలకు ఉపఎన్నికల ఫలితాలు చెంపపెట్టు అని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. యనమల మీడియాతో మాట్లాడుతూ బీజేపీపై నిప్పులు చెరిగారు. దేశ వ్యాప్తంగా బీజేపీపై ఎదురుగాలి చాలా బలంగా వీస్తోందన్నారు. దీనికి ఉపఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు. గతంలో రెండు ఉప ఎన్నికల్లో దెబ్బతిన్నారని.. ఇప్పుడు మరో దెబ్బతిన్నారని ధ్వజమెత్తారు. అయినా వరుస ఓటములపై బీజేపీలో ఆత్మ విమర్శ కొరవడిందని తెలిపారు. కర్ణాటక ఎన్నికలతో ప్రారంభమైన బీజేపీ పతనం.. ఇప్పుడు రెండో అంకం ఉపఎన్నికల ఫలితాలతో తేలిందన్నారు. ఇక 2019 ఎన్నికలతో బీజేపీ ఓటముల పరంపర పూర్తవుతుందని చెప్పుకొచ్చారు. మోదీ శకం 5 ఏళ్లకే ముగిసిపోతుందని జోస్యం చెప్పారు.

LEAVE A REPLY