దేశ్ బచావో తొలి లిరికల్ సాంగ్ విడుదల

0
15

ప్రత్యేక హోదా కోసం పవన్‌కల్యాణ్‌ చేపట్టబోతున్న మౌన నిరసనలో భాగంగా జనసేన అధ్యక్షుడు ఈ రోజు దేశ్ బచావో పేరుతో నాలుగు లిరికల్ సాంగ్స్ విడుదల చేస్తున్నట్టు తెలిపాడు. ప్రతి 45 నిమిషాలకొకసారి ఒక్కో సాంగ్ విడుదల చేస్తానన్న పవన్ తాజాగా ట్రావెలింగ్ సోల్జ్యర్ అనే సాంగ్ విడుదల చేశారు. తమ్ముడు సినిమాలో రమణ గోగుల కంపోజ్ చేసిన లుక్ ఎట్ మై ఫేస్ ఇన్ ది మిర్రర్ సాంగ్ ని డిజే పృద్వీ చే రీమేక్ చేయించి విడుదల చేశాడు. దేశ్ బచావో ట్రావెలింగ్ సోల్జర్ బంగ్రా లడ్డూ మిక్స్ పేరుతో ఈ సాంగ్ ఉంది. ఇందులో చివరగా పవన్ కళ్యాణ్ ఆవేశ పూరిత డైలాగులు కూడా ఉండడం విశేషం.

LEAVE A REPLY