దేశాభివృద్ధిలో మహిళలది కీలక పాత్ర

0
20

దయ, సహనం, కష్టపడేతత్వంతో రాబోవు మహిళా తరాలు దేశాభివృద్ధి, ప్రగతికి అమూల్యమైన సేవలను అందించాలని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఆకాంక్షించారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. మహిళా సాధికారత కోసం ప్రభుత్వం చారిత్రక చట్టాలను అమలు చేస్తున్నదని తెలిపారు. దేశ నిర్మాణంలో స్త్రీలకు సమానమైన భాగస్వామ్యం కల్పించేందుకు దూరదృష్టితో బేటీ బచావో.. బేటీ పఢావో వంటి కార్యక్రమాలను చేపట్టినట్టు చెప్పారు. స్త్రీలు తమ ఆకాంక్షలను నెరవేర్చుకునేందుకు అన్ని రకాలుగా మద్దతు ఇవ్వాలన్నారు. భద్రత, గౌరవం, సమానత్వం వారి పవిత్ర హక్కులు. దేశంలో భ్రూణహత్యల నివారణకు, బాలికా విద్య దిశగా వేసిన గొప్ప ముందడుకు బేటీ బచావో.. బేటీ పఢావో కార్యక్రమం అని పేర్కొన్నారు. లింగ సమానత్వం, నిజమైన మహిళా సాధికారత కోసం దేశ ప్రజలంతా పునరంకితం కావాలని ఆయన పిలుపునిచ్చారు.

LEAVE A REPLY