దేశానికే రాష్ట్రం ఆదర్శం

0
27

అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని రోడ్లు, భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు చెప్పారు. శనివారం వికారాబాద్ జిల్లా తాండూరులో వికారాబాద్ జిల్లాకేంద్రం మీదుగా తాండూరుకు రూ.52 కోట్లతో నాలుగులైన్ల రోడ్డు, రూ.80 కోట్లతో తాండూరు-కొడంగల్, తాండూరు- చించోళి జాతీయరహదారిని అనుసంధానం చేసే బైపాస్ రోడ్డు నిర్మాణానికి, పాత తాండూరు రైల్వే గేటు వద్ద రూ.51 కోట్ల అంచనాతో నిర్మించే వంతెనకు రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డితో కలిసి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు విలేకరుల సమావేశంలో మంత్రి తుమ్మల మాట్లాడారు. వచ్చే రెండున్నర ఏండ్లల్లో రాష్ట్రంలో వ్యవసాయ, పారిశ్రామికరంగాలకు నిరంతరాయంగా విద్యుత్‌సరఫరా చేసేందుకు రూ.లక్షన్నర కోట్ల పెట్టుబడితో రాష్ట్ర ప్రభుత్వం నాలుగు పవర్‌ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నదన్నారు. నిబద్ధతతో, నిజాయితీతో ప్రభుత్వం ముందుకు వెళ్తున్న తీరును గుర్తించి ప్రతిపక్షాలు బుద్ధి తెచ్చుకోవాలని హితవుపలికారు.

LEAVE A REPLY