దేశమంతా రైతుబంధు అమలుకావాలి: మంత్రి కేటీఆర్

0
9

రైతుబంధు పథకంతో స్వరాష్ట్రంలో వ్యవసాయరంగానికి నవశకం ఆరంభమైందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు అభివర్ణించారు. రైతు కండ్లలో సంతోషం కనిపించే రోజులు వచ్చాయన్నారు. రైతుబిడ్డ సీఎం అయితే పరిపాలన ఎలా ఉంటుందో, రాజ్యం ఎంత సుభిక్షంగా ఉంటుందో సీఎం కేసీఆర్ చిత్తశుద్ధే చాటుతున్నదని చెప్పారు. పంట పెట్టుబడి కోసం అప్పుల ఊబిలో చిక్కుకునే రైతులను ఆ కష్టాలనుంచి విముక్తిచేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. ఇది దేశమంతా అమలుకావాలన్నదే తమ ఆకాంక్ష అన్నారు. దేశంలోని రైతులంతా జాగృతమై తెలంగాణలో ప్రవేశపెట్టిన పథకాలను అమలుచేయాలని అక్కడి ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలని పిలుపునిచ్చారు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట, ముస్తాబాద్ మండలాల్లో మంత్రి కేటీఆర్ రైతులకు చెక్కులు, పట్టాదార్ పాస్‌పుస్తకాలు అందజేశారు. జిల్లా రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ గడ్డం నర్సయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన రైతులనుద్దేశించి మాట్లాడుతూ, రైతుల సమస్యలు తీర్చడంలో నాటి ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here