దేశం మెచ్చుకుంటే..కాంగ్రెస్‌ నొచ్చుకుంటుంది

0
6

కాంగ్రెస్‌లో సీఎం అభ్యర్థులు ఎక్కువయ్యారు. పాపం ఎమ్మెల్యే అభ్యర్థులు తక్కువయ్యారు’. అంటూ రాష్ట్ర భారీనీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు దెప్పి పొడిచారు. బుధవారం మెదక్‌ పట్టణంలో జరిగిన సీఎం బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ విధానాలపై దేశం అంతా మెచ్చుకుంటుంటే.. కాంగ్రెస్‌ మాత్రం నొచ్చుకుంటుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ద్వారా మెదక్‌ జిల్లాకు సాగునీరందించేందుకు కృషి చేస్తుంటే కాంగ్రెసోళ్లు కేసులు వేస్తున్నారని ఆరోపించారు.

మెతుకుసీమకు ప్రాణాధారమైన మంజీరానదిలోని ప్రతినీటిబొట్టును వినియోగించుకుంటూ రైతన్నల బతుకులు మారుస్తామని స్పష్టం చేశారు. 65 యేళ్ల కాంగ్రెస్‌ పాలనలో 110 సంవత్సరాల ఘనపురం ఆనకట్ట చరిత్రలో రైతులు ఆందోళన చేయకుండా నోటిమాట కూడా అడక్కుండానే వారి పంట పొలాలకు సింగూర్‌ నుంచి సాగు నీరిచ్చిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వందేనన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మెదక్‌జిల్లాపై పూర్తి అవగాహన ఉందన్నారు.

LEAVE A REPLY