దేశంలో అసహనం పెరుగుతున్నది

0
16

దేశంలో అసహనం, ద్వేషం పెరుగుతున్నాయని ప్రముఖ కవి, సాహితీవేత్త అశోక్ వాజపేయి అన్నారు. ఏడో హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్‌ను శుక్రవారం బేగంపేట హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో ఆయన ప్రారంభించి మాట్లాడారు. రచయితలు, మేధావులు, మహిళలు, మైనార్టీలు, ఆదివాసీలు అన్ని వర్గాలపై దాడులు పెరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవాల్ని ప్రతిబింబించాల్సిన బాధ్యత రచయితలపై ఉందని అశోక్ అన్నారు. ఫిలిప్పీన్స్ అంబాసిడర్ మారియా టెరెసిటా డాజా మాట్లాడుతూ వేర్వేరు సమూహాలు అభిప్రాయాలు పంచుకునేందుకు, కళల్ని ప్రదర్శించేందుకు హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ వేదికగా నిలుస్తున్నదన్నారు. ఫిలిప్పీన్స్ భాష, సంస్కృతిపై భారతదేశ ప్రభావం ఉందన్నారు. రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ మాట్లాడుతూ హైదరాబాద్ పారిశ్రామిక, సాంకేతిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతున్నదన్నారు. వేర్వేరు దేశాలకు చెందిన రచయితలు పలు అంశాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రముఖ రచయిత్రి మహాశ్వేతాదేవికి నివాళిగా రాజస్థాన్‌కి చెందిన బుద్ధన్ థియేటర్ గ్రూప్ ప్రదర్శించిన చోలీ కే పీచే క్యా హై నాటకం ఆకట్టుకుంది.

LEAVE A REPLY