దేశంలోనే పొడవైన కేబుల్ వంతెన ప్రారంభం

0
13

దేశంలోనే పొడవైన కేబుల్ వంతెనను ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం ప్రారంభించారు. నాలుగు లేన్ల అహ్మదాబాద్-ముంబై జాతీయ రహదారిపై భారుచ్ వద్ద రూ.379 కోట్లతో ఎల్‌అండ్‌టీ సంస్థ ఈ వంతెనను నిర్మించింది. 1.4 కిలోమీటర్ల పొడవైన ఈ వంతెన నిర్మాణానికి రెండేండ్లు పట్టింది. దేశంలోని అత్యంత రద్దీగా ఉండే రహదారుల్లో ఒకటైన ఎన్‌హెచ్8 పై రాకపోకలను ఇది సులభతరం చేస్తుంది. 1344 మీటర్ల పొడవు, 22.8 మీటర్ల వెడల్పుతో నిర్మించిన ఈ వంతెనలో 25 నుంచి 40 మీటర్ల పొడవైన 216 కేబుల్స్ ఉపయోగించారు. కోల్‌కతాలోని విద్యాసాగర్ సేతు కన్నా ఇది 521 మీటర్లు పొడవైనది. వారణాసిలో యూపీ ఎన్నికల ప్రచారం ముగించుకొని రెండు రోజుల గుజరాత్ పర్యటనపై వచ్చిన ప్రధాని మోదీ భారుచ్ వంతెనను ప్రారంభించడంతోపాటు దహేజ్‌లో నిర్మించిన ఓపల్ పెట్రోకెమికల్స్ కాంప్లెక్స్‌ను జాతికి అంకితం చేశారు.

LEAVE A REPLY