దెయ్యాల భయంతో నివాసాన్ని వదిలిన బ్రెజిల్ అధ్యక్షుడు

0
15

ఏ దేశమైనా.. ఎవరైనా సరే.. వ్యక్తులకు భద్రతను ఇవ్వగలరు. కానీ, దెయ్యాలు, భూతాలు ఉన్నాయని నమ్మే విపరీతమైన మనస్తత్వం గల వ్యక్తులకు ఏం భద్రతను ఇవ్వగలరు. ఆఖరికి ఆయన దేశధ్యక్షుడైనా సరే. సరిగ్గా ఇలాంటి మనస్తత్వం కలిగిన బ్రెజిల్ అధ్యక్షుడు మైఖెల్ టెమెర్ బ్రెజిలియాలోని అత్యంత విలాసవంతమైన అధికార నివాసాన్ని ఖాళీ చేశారు. ఆ నివాసంలో అసాధారణమైనవి ఏమో ఉన్నట్టుగా నాకు అనిపిస్తున్నది. తొలి రోజు నుంచి కూడా నేను సుఖంగా నిద్ర పోలేదు. ఆ ఇంట్లో దెయ్యాలు ఉన్నాయి అని టెమెర్ ఒక మీడియా సంస్థతో అనుమానం వ్యక్తం చేశారు. బ్రెజిల్ అధ్యక్షుడి అధికార నివాసమైన అల్వొర్డ ప్యాలెస్ రాజధాని బ్రెజిలియా నడిబొడ్డున ఉంటుంది. అది అత్యంత విలాసమైన నివాసం. దెయ్యాల కారణంగా ఈ నివాసాన్ని అధ్యక్షుడు మైఖెల్ టెమెర్ కుటుంబం వీడి చిన్నదైన దేశ ఉపాధ్యక్షుడి నివాసానికి మారారు.

LEAVE A REPLY