దృశ్యం సినిమా స్ఫూర్తితో వ్యాపారి హత్య!

0
57

బాలీవుడ్‌ ‘దృశ్యం సినిమా నుంచి స్ఫూర్తి పొందిన తండ్రీకొడుకులు ఒక వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. పుణెలోని కుడల్క్వాడీకి చెందిన తండ్రీకొడుకులు సమిదుల్లాహ్‌(54), మెహబూబ్‌(26) పాత ఇనుము వ్యాపారం చేసేవారు. కొంత కాలం క్రితం అదే ప్రాంతానికి చెందిన వడ్డీ వ్యాపారి శివాజీ వాలేకర్‌ నుంచి వ్యాపార నిమిత్తం రూ.5 లక్షలు అప్పు తీసుకున్నారు. తీసుకున్న అప్పు, వడ్డీ కలిపి రూ.8.40 లక్షలు చెల్లించాలని వాలేకర్‌ వారిపై ఒత్తిడి తెచ్చాడు. అనేక సార్లు గొడవపడ్డారు. తండ్రీకొడుకులు తమ దుకాణంలోసెప్టెంబరు 27నఅతడి గొంతు కోసి హత్య చేసి, మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. బాలీవుడ్‌ సినిమా దృశ్యం నుంచి స్ఫూర్తి పొంది అదే తరహాలో పోలీసులకు సాక్ష్యాధారాలు దొరక్కుండా జాగ్రత్త పడ్డారు. వాలేకర్‌ తండ్రి ఫిర్యాదుపై పోలీసులు విచారణ ప్రారంభించారు. వాలేకర్‌ చనిపోయే ముందు సమిదుల్లా్‌హతో ఫోన్‌లో మాట్లాడినట్లు నిర్ధారించుకున్నారు. ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here