దీపికా ప‌దుకొణే 3 ల‌క్ష‌ల బ్యాగ్‌తో ఎయిర్ పోర్ట్‌లో

0
17

ఈ కాలం న‌టీమ‌ణులు వారి దుస్తులు లేదా వ‌స్తువుల‌తో త‌ర‌చూ వార్త‌ల‌లో నిలుస్తూ వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. అప్ప‌ట్లో ప్రియాంక చోప్రా 7 కోట్ల నెక్లెస్ ధ‌రించి హాట్ టాపిక్‌గా నిలిచింది. అలియా భ‌ట్ 1890 అమెరికన్‌ డాలర్స్(మ‌న క‌రెన్సీ ప్ర‌కారం 1,39,170 రూపాయ‌లు) ధ‌ర ఉన్న బ్యాగ్ ధ‌రించి ముంబై విమానాశ్ర‌యంలో మెరిసింది. ఈ బ్యాగ్ గురించి సోష‌ల్ మీడియాలో భారీ చ‌ర్చే జ‌రిగింది. ఇక తాజాగా బాలీవుడ్ భామ దీపికా ప‌దుకొణే 3 ల‌క్ష‌ల బ్యాగ్‌తో ఎయిర్ పోర్ట్‌లో త‌ళుక్కుమంది. ఇప్పుడు ఈమె బ్యాగ్ గురించి కూడా ఆస‌క్తిక‌ర‌ చ‌ర్చ న‌డుస్తుంది. ప‌ద్మావ‌త్ చిత్రంతో చివ‌రిగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన దీపిక ప్ర‌స్తుతం ఛపాక్ అనే సినిమాలో నటిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here