దీపాకు పెరుగుతున్న మద్దతు

0
18

శశికళ సొంత వూరైన తంజావూరు జిల్లాల్లో దీపాకు మద్దతు పెరుగుతుండడంతో శశికళ బంధువుల్లో గుబులు రేగుతోంది. జయలలిత మృతి తర్వాత అన్నాడీఎంకేలో ఉన్నత స్థాయి నిర్వాహకులు శశికళను ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేశారు. అయితే శశికళను అంగీకరించని వారు శశికళకు మద్దతుగా ఏర్పాటు చేస్తున్న ప్లాస్టిక్‌ బ్యానర్లపై పేడ చల్లి, పోస్టర్లను చింపేసి తమ వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో ఇందుకు మారుగా దివంగత ముఖ్యమంత్రి జయలలిత అన్న కుమార్తె దీపాకు రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు పెరుగుతూ వస్తోంది.

LEAVE A REPLY