దివ్యాంగులపై ప్రత్యేక శ్రద్ధ: ఆంధ్రప్రదేశ్‌ సీఎం

0
31

విజయవాడ: నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దివ్యాంగులకు 300 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, వాటిని భర్తీ చేస్తామని ప్రకటించారు. అందరికీ ఇళ్లు కట్టిస్తామని, ఈ ఏడాది 2,500 ట్రై సైకిళ్లు పంపిణీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. 1982లో పార్టీ పెట్టినప్పటి నుంచి కోటేశ్వరరావు పనిచేస్తున్నారు, కోటేశ్వరరావును ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరముందన్నారు. సమస్యలను అధిగమించే శక్తి ఉన్న దివ్యాంగులు ఎందరో ఉన్నారనీ, వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నామని తెలిపారు. కేవలం పింఛనుపైనే రూ.805 కోట్లు ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు. పేదరికాన్ని నిర్మూలిస్తేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుందన్నారు. దివ్యాంగులను అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, పీతల సుజాత, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

LEAVE A REPLY