దివిసీమ నుంచి ప్రారంభం.. సంక్రాంతి రోజు నిర్వహణ

0
30

స్థానిక పండుగలు.. కార్యక్రమాలకు రాష్ట్రవ్యాప్త ప్రచారం కల్పించి.. పర్యాటకులను ఆకర్షించాలని యోచిస్తున్న పర్యాటక శాఖ దివిసీమలో పడవల పోటీ నిర్వహణకు సన్నద్ధమవుతోంది. కేరళ తరహాలో పడవల పోటీలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. కృష్ణా నది సముద్రంలో కలిసే నాగాయలంక, హంసలదీవి వద్ద బ్యాక్‌ వాటర్‌ ఎక్కువగా ఉంటుంది. ఏటా సంక్రాంతి సమయంలో ఇక్కడ నాగాయలంక, కోడూరు మండలాల్లోని మత్య్సకార యువత ‘పడవల పోటీలు’ నిర్వహిస్తుంది. ఈ పోటీలను చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు వస్తుంటారు. దీనిపై దృష్టిపెట్టిన పర్యాటక శాఖ.. దివిసీమ పడవల పోటీలను పెద్ద ఎత్తున నిర్వహించి.. రాష్ట్రవ్యాప్త ప్రచారం కల్పించాలని నిర్ణయించింది. దీనికి ‘దివిసీమ పడవల పోటీ’గా నామకరణం చేసింది. 14న జరిగే ఈ పోటీల కోసం రూ.25 లక్షలను కేటాయించింది. ఈ పోటీలో 150 పడవలు పాల్గొనే అవకాశం ఉంది. ప్రతి పడవలో ఇద్దరిని ఉంచి.. పోటీలు నిర్వహించాలని నిర్ణయించారు. గుంటూరు, ప్రకాశం, కృష్ణా, ఉభయ గోదావరి యువతకు ఈ పోటీల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నారు.

LEAVE A REPLY