దిల్‌ రాజుకు ఇది ‘బాహుబలి’ కంటే పెద్ద విజయం!

0
21
తెలుగు సినీ చరిత్రలో అసాధారణమైన విజయం సాధించిన చిత్రం ‘బాహుబలి’. కేవలం నిర్మాతలనే కాకుండా డిస్ట్రిబ్యూటర్లను కూడా లాభాల్లో ముంచెత్తింది ఈ చిత్రం. ‘బాహుబలి’ మొదటి భాగం నైజాం హక్కులను దిల్‌ రాజు 24 కోట్ల రూపాయలు చెల్లించి దక్కించుకున్నాడు.

ఆ సినిమా విడుదలై దిల్‌ రాజుకు పది కోట్ల రూపాయల మేర లాభాలను తెచ్చిపెట్టింది. వచ్చిన కలెక్షన్లలో ప్రొడ్యూసర్‌ షేర్‌ను ఇచ్చేయగా మిగిలిన లాభాలు అవి. ఓ ఏరియాకు సంబంధించిన హక్కుల కోసం రూ.24 కోట్లు చెల్లించడమంటే చాలా పెద్ద రిస్క్‌. ఆ రిస్క్‌ చేసి దిల్‌ రాజు భారీ ఫలితాన్ని అందుకున్నారు. అయితే తాజాగా ‘శతమానం భవతి’ దిల్‌ రాజుకు అంతకంటే భారీ లాభాలను అందించింది. పెద్దగా రిస్క్‌ లేని ఈ ప్రాజెక్టు కోసం దిల్‌ రాజు కేవలం 15 కోట్ల రూపాయల కంటే తక్కువే పెట్టుబడి పెట్టాడు. కానీ, అనూహ్య విజయం సాధించిన ఈ చిత్రం దాదాపు 30 కోట్ల రూపాయలను తన ఖాతాలో వేసుకుంది. అంటే పెట్టిన దానికి డబుల్‌ వచ్చిందన్నమాట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here