దాసరికి చికిత్స కొనసాగుతోంది

0
20

ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు రెండు రోజుల క్రితం అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారని కిమ్స్‌ వైద్యులు తెలిపారు. అన్నవాహికలో సమస్యను గుర్తించి చికిత్స అందిస్తుండగా మూత్రపిండాలు, వూపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ వచ్చిందని తెలిపారు. శస్త్రచికిత్స పూర్తయిందని, డయాలసిస్‌, వెంటిలేటర్‌ సాయంతో వైద్యం అందిస్తున్నట్లు వివరించారు. ప్రస్తుతం దాసరి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని, రెండు మూడు రోజుల్లో కోలుకుంటారని వైద్యులు వెల్లడించారు.

ప్రముఖుల పరామర్శ
సికింద్రాబాద్‌ కిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దాసరిని మంచు మనోజ్‌, నటి జయసుధ, నిర్మాత అల్లు అరవింద్‌, దర్శకుడు రాఘవేంద్రరావు పరామర్శించారు. నిన్న దాసరి పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం మెరుగ్గానే అల్లు అరవింద్‌ తెలిపారు.

LEAVE A REPLY