దారుణంగా పరుగులిచ్చిన బాసిల్‌ థంపి 14 పరుగులతో సన్‌రైజర్స్‌ ఓటమి

0
7

అద్భుత బౌలింగ్‌, ఫీల్డింగ్‌తో ప్లే ఆఫ్‌ చేరిన సన్‌రైజర్స్‌ గురువారం రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో తేలిపోయింది. తమ బలమైన బౌలింగ్‌, ఫీల్డింగ్‌లోనే విఫలమై ఈ సీజన్‌లో నాలుగో ఓటమిని చవిచూసింది. ఇక సన్‌ యువబౌలర్‌ బాసిల్‌ థంపి ఈ మ్యాచ్‌లో ఏకంగా 70 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్‌గా చెత్త రికార్డు నమోదు చేశాడు. సన్‌ స్టార్‌ బౌలర్‌ భువనేశ్వర్‌ స్థానంలో తుది జట్టులోకి వచ్చిన థంపి.. వేసిన నాలుగు ఓవర్లలో 19,18,14,19 పరుగులు ఇచ్చాడు. దీంతో ఇప్పటికి వరకు ఇషాంత్‌ శర్మ పేరు మీద ఉన్న ఈ చెత్తరికార్డును బ్రేక్‌ చేశాడు. 2013 సీజన్‌లో ఇషాంత్‌ 66 పరుగులిచ్చాడు. ఇప్పటి వరకు ఇదే అత్యధికం కాగా తాజాగా థంపి అధిగమించాడు. ఇషాంత్‌ తర్వాత ఉమేశ్‌ యాదవ్‌ (0/65), సందీప్‌ శర్మ(1/65), వరుణ్‌ ఆరోన్‌ (2/63), అశోక్‌ దిండా(0/63)లు అత్యధిక పరుగులిచ్చిన జాబితాలో ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here