దశాబ్దాలుగా పెండింగులో పడిపోయిన రోడ్డు ఓవర్ బ్రిడ్జీలు త్వరలోనే

0
28

రహదారులు.. ప్రగతి రథచక్రాలు. అభివృద్ధి ప్రక్రియలో ముఖ్య సాధనాలు. నిత్యం ప్రజల ప్రయాణాలకు, సరుకుల రవాణాకు అవసరమయ్యే రహదారులు పటిష్ఠంగా, ఆటంకాలు లేకుండా ఉండటం కీలకం. ఈ వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకునే రాష్ట్ర ప్రభుత్వం సరయిన రహదారులు, సాఫీ ప్రయాణాలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన రెండున్నరేండ్లలో రోడ్డు కనెక్టివిటీతోపాటు, రైలు కనెక్టివిటీ కూడా అనూహ్యంగా పెరిగింది. అందుకు అనుగుణంగా ప్రభుత్వం రద్దీ సమస్యలను అధిగమించే చర్యలను చేపట్టింది. అధికశాతం జనాభా ఉన్న పట్టణ ప్రాంతాల్లో రోడ్డు ఓవర్ బ్రిడ్జీలు (ఆర్వోబీలు) లేకపోవడం తీవ్ర సమస్యలకు దారితీస్తుంది. రైల్వే ట్రాక్ దాటాలంటే ప్రజలకు అవస్థలు తప్పవు. ప్రమాదాల భయం పొంచి ఉంటుంది. రైలు గేట్లు పడినచోట్ల భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోవాల్సిందే. కష్టనష్టాలకు కారణమయ్యే ఈ సమస్యను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంది. ఎంతోకాలంగా పెండింగులో ఉన్న ప్రాజెక్టుల ఖర్చును సమానంగా భరిస్తామంటూ కేంద్ర ప్రభుత్వంతో 50-50 శాతం చొప్పున ఒప్పందం కుదుర్చుకుని రోడ్డు ఓవర్ బ్రిడ్జీల పనులను వేగవంతం చేసింది.

LEAVE A REPLY