దక్షిణ కొరియా పరిశ్రమలు తెలంగాణలో కార్యకలాపాలను ప్రారంభించడం కోసం రాష్ట్రంలో

0
19

తెలంగాణలో పెట్టుబడులకు ముందుకు వచ్చే కొరియన్ సంస్థలకోసం ప్రత్యేకంగా కొరియన్ ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు ప్రకటించారు. రాష్ట్రానికి వచ్చే ప్రతి కొరియన్ పెట్టుబడిదారుడికి పూర్తి సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. ఉత్తమ సౌకర్యాలు, పాలసీలు అమలు చేస్తున్న తెలంగాణ రాష్ట్రమే కొరియన్ కంపెనీలకు భారతదేశంలో అత్యుత్తమ ఆకర్షణీయమైన గమ్యస్థానమని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర ఉన్నతాధికారుల బృందంతో దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఇన్ కొరియా (ఐసీసీకే) గురువారం ఏర్పాటు చేసిన వ్యాపారవేత్తల సమావేశంలో ప్రసంగించారు. సియోల్‌లో జరిగిన ఈ సమావేశానికి వందకు పైగా వివిధ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు.

LEAVE A REPLY