దక్షిణాదిలో కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నది నయనతార

0
30

మహిళా ప్రధాన చిత్రాలు, ప్రయోగాత్మక కథాంశాలకు దక్షిణాదిలో కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నది నయనతార. ఆమె కథానాయికగా నటిస్తున్న తాజా చిత్రం డోర. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రానికి దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా పతాకంపై మల్కాపురం శివకుమార్ తెలుగులో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ఈ సందర్భంగా మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ మహిళా ప్రధాన ఇతివృత్తంతో తెరకెక్కుతున్న హారర్ చిత్రమిది. ఓ యువతి జీవితంలో చోటుచేసుకున్న అనూహ్య సంఘటనలు ఉత్కంఠను పంచుతాయి. ఆద్యంతం ఊహకందని మలుపులతో థ్రిల్‌ను కలిగిస్తుంది. ఇటీవల విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు, టైటిల్‌కు చక్కటి స్పందన లభిస్తున్నది. నయనతార నటన, పాత్ర చిత్రణ సరికొత్తగా ఉంటాయి. గతంలో వచ్చిన హారర్ చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉండే చిత్రమిది. నవ్యతతో కూడిన కథాబలమున్న చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశ్యంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. జనవరిలో ఆడియోను విడుదల చేస్తాం. ఫిబ్రవరిలో తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: దినేష్, సంగీతం: వివేక్, నిర్మాత: మల్కాపురం శివకుమార్.

LEAVE A REPLY