దంగ‌ల్‌పై గీతా, బ‌బితా కోచ్ సీరియ‌స్‌

0
31

న్యూఢిల్లీ: రెజ్ల‌ర్ మ‌హావీర్ పోగ‌ట్ జీవిత చ‌రిత్ర ఆధారంగా అమీర్‌ఖాన్ నటించిన దంగ‌ల్ సినిమాపై గీతా, బ‌బితాల కోచ్ ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు. త‌న‌ను నెగ‌టివ్ రోల్‌లో చూపించ‌డంపై ఆయ‌న తీవ్రంగా మండిప‌డ్డారు. త‌న‌తో పాటు మ‌రో న‌లుగురు కోచ్‌లు ఆ ఇద్ద‌రికీ కోచింగ్ ఇచ్చినా వాళ్ల‌ను సినిమాలో అస‌లు చూపించ‌లేదని నేష‌న‌ల్ కోచ్ పీఆర్ సోంధి అన్నారు. కామ‌న్వెల్త్ గేమ్స్‌లో పోటీ ప‌డే ముందు మూడేళ్ల‌పాటు ఈ ఇద్ద‌రికీ సోంధియే కోచింగ్ ఇచ్చారు. అయితే దంగ‌ల్ మూవీలో ఆ కోచ్ క్యారెక్ట‌ర్‌కు పీఆర్ క‌ద‌మ్ అన్న పేరు పెట్టి.. నెగ‌టివ్ రోల్‌లో చూపించ‌డం సోంధికి న‌చ్చ‌లేదు. సినిమాలో వినోదం కోసం కొన్ని క‌ల్పిత స‌న్నివేశాల‌ను క‌లిపార‌న్న విష‌యం తెలుసుకానీ.. దాని కోసం త‌న పాత్ర‌ను నెగ‌టివ్ చేయ‌డం స‌రికాదని ఆయ‌న అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here