‘దంగల్‌’ సిస్టర్స్‌పై వేటు

0
6

నేషనల్‌ క్యాంప్‌కు హజరుకానందుకుగాను జాతీయ రెజ్లింగ్‌ సమాఖ్య(డబ్ల్యూఎఫ్‌ఐ) ఫోగట్‌ సిస్టర్స్‌పై వేటు వేసిన సంగతి తెలిసిందే. అయితే డబ్ల్యూఎఫ్‌ఐ ఫోగట్‌ సిస్టర్స్‌కు మరో అవకాశం ఇచ్చింది. నేషనల్‌ కాంప్‌కు హాజరుకానందుకు కల కారణాన్ని వివరిస్తే వారిని తిరిగి చేర్చుకునే అవకాశాలను పరిశీలిస్తామని తెలిపింది. కామన్వెల్త్‌ క్రీడల్లో పతకాలు సాధించడమే కాక వారి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘దంగల్‌’ సినిమాతో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న ఫోగట్‌ సిస్టర్స్‌ గీత, బబితలతో పాటు వీరి చెల్లెళ్లు రీతు, సంగీత కూడా ప్రస్తుతం లక్నోలో నిర్వహిస్తున్న నేషనల్‌ క్యాంప్‌కు హాజరుకాలేదు. ఈ కారణం వల్ల డబ్ల్యూఎఫ్‌ఐ వీరి మీద వేటు వేసింది.

LEAVE A REPLY