దంగల్‌’లో ఆ సీన్‌ నిజం కాదంటున్న గీత

0
59

రెజ్లర్‌ మహావీర్‌ సింగ్‌ ఫొగాట్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘దంగల్‌’. మహావీర్‌ సింగ్‌, అతని కూతుళ్లు గీతా ఫొగాట్‌, బబితా కుమారి నిజజీవిత కథలను ఇందులో హృద్యంగా చూపించారు. ఆ సినిమాలోని ఎమోషన్లు చూసి సామాన్యులే కదలిపోయారు. మరి, మహావీర్‌ పెద్ద కూతురు గీత ఈ సినిమా చూసి ఏమనుకుంది?

తాజాగా ఆమె తన మనసులోని మాటను వెల్లడించింది. సినిమా అంతా బాగున్నా, అందులో ఓ సీన్‌ తనకు నచ్చలేదని, వాస్తవానికి బాగా నాటకీయత జోడించేశారని వెల్లడించింది. తండ్రి నేర్పించిన టెక్నిక్కుల కంటే కోచ్‌ చెప్పినవే గొప్పవని నమ్మే గీత ఓ దశలో తండ్రితోనే కుస్తీ పోటీకి దిగుతుంది. ఆ తర్వాత పలు అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని ఓటమి పాలవుతుంది. ఆ సమయంతా తండ్రికి, గీతకు మధ్య యుద్ధం జరుగుతున్నట్టే చూపించారు. అయితే అదంతా నిజం కాదంటోంది గీత. తన తండ్రితో కేవలం ఒకసారే తలపడ్డానని, అంతటితో అది ముగిసిపోయిందని, కానీ, సినిమాలో బాగా నాటకీయత జోడించేసి తండ్రితో బాగా తలపడినట్లు చూపించారని వాపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here