త‌న జ‌న్‌ధ‌న్ ఖాతాలో 100 కోట్ల బ్యాలెన్స్

0
42

త‌న జ‌న్‌ధ‌న్ ఖాతాలో 100 కోట్ల బ్యాలెన్స్ చూపిస్తున్న‌ట్లు ఓ మ‌హిళా క‌స్ట‌మ‌ర్ ప్ర‌ధాని మోదీకి ఫిర్యాదు చేసిన ఘ‌ట‌న‌పై మీర‌ట్‌కు చెందిన బ్యాంకు ఇవాళ వివ‌ర‌ణ ఇచ్చింది. ఫిర్యాది షీత‌ల్ యాద‌వ్ అకౌంట్లో ఉన్న‌ది మైన‌స్ లావాదేవి అని బ్రమ్‌పురి ఎస్‌బీఐ బ్యాంక్ స్ప‌ష్టం చేసింది. నోట్ల ర‌ద్దు వ‌ల్ల త‌న అకౌంట్లోకి భారీగా సొమ్ము జ‌మ అయిన‌ట్లు ఆ మ‌హిళ త‌ప్పుగా ఊహించుకుంద‌ని బ్యాంక్ పేర్కొంది. వాస్త‌వానికి షీత‌ల్ అకౌంట్లో కేవ‌లం రూ.611 మాత్ర‌మే బ్యాలెన్స్ ఉంది. అయితే షీత‌ల్‌కు చెందిన‌ బ్యాంక్ అప్లికేష‌న్‌లో త‌ప్పుడు స‌మాచారం ఉంది. అలాంటి క‌స్ట‌మ‌ర్ల లావాదేవీల‌ను అడ్డుకునేందుకు మైన‌స్ అమౌంట్‌ను చూపిస్తార‌ని బ్యాంక్ అధికారులు వెల్ల‌డించారు. కైవైసీ(నో యువ‌ర్ క‌స్ట‌మ‌ర్‌) స‌మాచారం అప్‌డేట్ చేయ‌డం కోసం కూడా మైన‌స్ అమౌంట్‌ను చూపిస్తామ‌ని బ్యాంక‌ర్లు తెలిపారు. క‌స్ట‌మ‌ర్ వివ‌రాలు పూర్తిగా లేన‌ప్పుడు, ఇలాంటి ప‌ద్ధ‌తిని అవ‌లంబిస్తామ‌ని బ్ర‌మ్‌పురి ఎస్‌బీఐ బ్యాంక్ మేనేజ‌ర్ సుశీల్ కుమార్ సేథి తెలిపారు. మైన‌స్ ట్రాన్‌జాక్ష‌న్‌ను క‌స్ట‌మ‌ర్ గ్ర‌హించ‌లేపోయింద‌ని మేనేజ‌ర్ స్ప‌ష్టం చేశారు. దీనికి సంబంధించి నివేదిక‌ను ఆదాయ‌ప‌న్నుశాఖ‌కు పంపించామ‌న్నారు. కస్టమర్ షీతల్ అకౌంట్లో 99 కోట్ల 99 లక్షల 99 వేల 394 రూపాయలు ఉన్నట్లు బ్యాంక్ పాస్ బుక్ లో ఉంది. అయితే పక్కన ఉన్న మైనస్ సింబల్ ను ఆమె గుర్తించలేకపోయినట్లు అధికారులు తెలిపారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here