త్రివర్ణాలతో బుర్జ్‌ఖలీఫా

0
16

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా భారతదేశ జాతీయ పతాకం రంగులతో కాంతులీనుతున్నది. గురువారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా బుర్జ్ ఖలీఫాను జాతీయ పతాకం పోలి ఉండేలా ఎల్‌ఈడీ దీపాలతో అలంకరించినట్టు నిర్వాహకులు ట్విట్టర్‌లో తెలిపారు. రిపబ్లిక్ డే వేడుకల్లో ముఖ్య అతిథిగా యూఏఈ యువరాజు షేక్ మహమ్మద్ బిన్ జయేద్ అల్ నహ్యాన్ పాల్గొంటున్న సంగతి తెలిసిందే.

LEAVE A REPLY