తొలి టెస్టులో బంగ్లాదేశ్ బ్యాట్స్‌మన్ షకీబ్

0
35

న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ బ్యాట్స్‌మన్ షకీబ్ అల్ హసన్ (276 బంతుల్లో 217) డబు ల్ సెంచరీతో చెలరేగాడు. దీంతో బంగ్లా తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ముష్ఫీకర్ రహీమ్ (159) కూడా సెంచరీతో కదంతొక్కడంతో.. 154/3 ఓవర్‌నైట్ స్కోరుతో రెండోరోజు ఇన్నింగ్స్ కొనసాగించిన బంగ్లాదేశ్ ఆట ముగిసేసరికి తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లకు 542 పరుగులు చేసింది. శబ్బీర్ రెహమాన్ (10) క్రీజులో ఉన్నాడు. బంగ్లా తరఫున డబుల్ సెంచరీ చేసిన మూడో క్రికెటర్ షకీబ్. గతంలో తమీమ్, ముష్ఫీకర్‌లు డబుల్ సాధించారు. షకీబ్, ముష్ఫీకర్ ఐదో వికెట్‌కు 359 పరుగులు జోడించారు. బంగ్లా తరఫున ఏ వికెట్‌కైనా ఇదే రికార్డు భాగస్వామ్యం. డబుల్ సెంచరీతో షకీబ్ (3146) టెస్టుల్లో 3 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. బంగ్లా తరఫున ఈ ఘనత సాధించిన మూడో క్రికెటర్ ఇతను. తమీమ్ (3405), హబీబుల్ బాషర్ (3026) ఈ జాబితాలో ఉన్నారు

LEAVE A REPLY