తొలిసారి వెండితెరపై ఆవిష్కృతమైన శాతకర్ణి చరిత్ర

0
35

గౌతమిపుత్ర శాతకర్ణి చరిత్ర తొలిసారి వెండితెరపై ఆవిష్కృతమైంది. క్రిష్ దర్శకత్వం వహించగా, హీరోగా నందమూరి బాలకృష్ణ నటించిన ఈ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాలలోనే గాక, ప్రపంచ వ్యాప్తంగా మంచి స్పందన వస్తోంది. అన్ని థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంది. బాలకృష్ణ అభిమానులు ప్రేత్యేక పూజలు నిర్వహించి, బాణా సంచా కాలుస్తూ సందడి చేస్తున్నారు. సినిమా చాలా అద్భుతంగా ఉందని, సూపర్ డూపర్ హిట్టని, దర్శకుడు క్రిష్ 80 రోజుల్లో సినిమా తీయడం ఆయనే సాధ్యమని, ఇందులో బాలయ్యది చాలా అద్భుతమైన నటనని అభిమానులు కొనియాడారు. ఇలాంటి సినిమాలో చెయ్యాలంటే ఒక్క బాలయ్యకే సాధ్యమని, ఇది బాలయ్య అభిమానులకు పండగని అన్నారు.

LEAVE A REPLY