తొలిసారి వీడియోకి చిక్కిన ఘోస్ట్ షార్క్

0
38

కాలిఫోర్నియా: మహా సముద్రాల అడుగు భాగంలో అంతుపట్టకుండా జీవించే జలచరాల్లో చిమైరా చేప (ఘోస్ట్ షార్క్) ఒకటి. అరుదుగా కనిపించే ఈ చేప తొలిసారి 2009లో కెమెరాకు చిక్కింది. ఒక స్వచ్ఛం ద సంస్థ సహకారంతో మొంటెరే బే అక్వారియం రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ పరిశోధకులు లొన్నీ లండ్‌స్టెన్, ఆయన సహ విద్యార్థులు మధ్య కాలిఫోర్నియా, హవాయి మధ్య రిమోట్‌తో నడిచే వాహనాలను సముద్ర జలాల్లో వదిలారు. అవి 6700 అడుగుల లోతున కనిపించిన ఈ చిమైరాచేప కదలికలను వీడియోలో చిత్రీకరించి పంపడంతో ఆశ్చర్యపోవడం పరిశోధకుల వంతైంది. ఇటీవలే దాని జీవిత విధానంపై రూపొందించిన పత్రాలను మీడియాకు మొం టెరే బో అక్వారియం రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ విడుదలచేసింది. వింత లక్షణాలు కల ఈ చేప కండ్లు పాలిపోయినట్లు నిర్జీవంగా కనిపిస్తాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here