తొలిరౌండ్లోనే ముగిసిన సానియా పోరు

0
49
 టైటిల్‌ లక్ష్యంగా ఫ్రెంచ్‌ ఓపెన్‌లో అడుగుపెట్టిన పెట్రా క్విటోవా పోరాటం రెండో రౌండ్లోనే ముగిసింది. ఈ చెక్‌ భామకు అమెరికా వెటరన్‌ ప్లేయర్‌ బెతానీ మాటెక్‌ సాండ్స్‌ చెక్‌ పెట్టింది. బుధవారమిక్కడ ఉత్కంఠగా సాగిన మహిళల సింగిల్స్‌ రెండో రౌండ్లో 15వ సీడ్‌ క్విటోవా 6-7 (5), 6-7 (5)తో మాటెక్‌ సాండ్స్‌ చేతిలో పోరాడి ఓడింది. కాగా.. పురుషుల సింగిల్స్‌లో లోకల్‌ స్టార్‌ జో విల్‌ఫ్రెడ్‌ సోంగా (ఫ్రాన్స్‌) కూడా అనూహ్యంగా ఓటమిపాలయ్యాడు. వెలు తురు లేమి కారణంగా బుధవారానికి వాయిదా పడ్డ మ్యాచ్‌ లో 12వ సీడ్‌ సోంగా 5-7, 4-6, 7-6 (6), 4-6తో రెన్జో ఒలీవో (అర్జెంటీనా) చేతిలో చిత్తయ్యాడు. ఇక డిఫెండింగ్‌ చాంప్‌ జొకోవిచ్‌ (సెర్బియా) 6-1, 6-4, 6-3తో సౌసా (పోర్చుగల్‌)పై నెగ్గగా.. తొమ్మిది సార్లు చాంపియన్‌ రఫెల్‌ నడాల్‌ (స్పెయిన్‌) 6-1, 6-4, 6-3తో రాబిన్‌ హాస్‌ (నెదర్లాండ్స్‌)పై అలవోక విజయం సాధించాడు. ఇతర మ్యాచ్‌ల్లో డొమినిక్‌ థీమ్‌ (ఆస్ర్టియా) 7-5, 6-1, 6-3తో బొలెల్లిపై నెగ్గగా.. దిమిత్రోవ్‌ 6-3, 6-4, 7-5తో రొబ్రెడోపై గెలుపొందాడు. కాగా, మహిళల డిఫెండింగ్‌ చాంప్‌, నాలుగో సీడ్‌ ముగురుజ రెండోరౌండ్‌లో 6-7 (4), 6-4, 6-2తో ఇస్తోనియాకు చెందిన కోంటవిట్‌పై పోరాడి గెలిచింది. ఇతర మ్యాచ్‌ల్లో పదోసీడ్‌ వీనస్‌ 6-3, 6-1తో నారా (జపాన్‌)పై, మ్లెదనోవిచ్‌ (ఫ్రాన్స్‌) 6-2, 6-3తో సారా ఎరాని (ఇటలీ)పై గెలిచారు. వోజ్నియాకి (డెన్మార్క్‌) 6-0, 6-0తో ఫ్రాంకోస్‌ (కెనడా)ను చిత్తుచేసింది.
పేస్‌, బోపన్న ముందంజ: మహిళల డబుల్స్‌ తొలిరౌండ్లో సానియా మీర్జా (భారత)-ష్వెదోవా (కజకిస్తాన్‌) 6-7 (5), 6-1, 2-6తో గార్విలోవా (ఆస్ర్టేలియా)-పావ్లిచెంకోవా (రష్యా) ద్వయం చేతిలో ఓడి ఇంటిదారి పట్టింది. పురుషుల డబుల్స్‌ తొలిరౌండ్లో లియాండర్‌ పేస్‌ (భారత)-లిప్‌స్కీ (అమెరికా) జోడీ 7-6 (5), 4-6, 6-2తో ఆల్బోట్‌-చంగ్‌ ద్వయంపై నెగ్గింది. మరో మ్యాచ్‌లో రోహన బోపన్న (భారత)-కువాస్‌ (ఉరుగ్వే) జోడీ 6-1, 6-1తో ఫ్రాన్స్‌ ద్వయం బోర్గూ-మాథ్యూపై గెలిచి రెండో రౌండ్‌కు చేరుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here