తెలుగు చిత్రసీమలో హీరోయిజానికి సరికొత్త అర్థా0

0
23

తెలుగు చిత్రసీమలో హీరోయిజానికి సరికొత్త అర్థాన్ని తీసుకువచ్చిన దర్శకుల్లో పూరిజగన్నాథ్ ఒకరు. మూస ధోరణికి భిన్నంగా ఆయన సినిమాల్లో హీరోలు కనిపిస్తారు. వేగంగా సినిమాల్ని తెరకెక్కించడం ఆయన శైలి. అందుకే స్టార్ హీరోలు సైతం ఆయనతో సినిమాలు చేసేందుకు ఆసక్తిని చూపిస్తారు. జయాపజయాలకు అతీతంగా తను నమ్మిన దారిలోనే సినిమాల్ని రూపొందిస్తూ ముందుకు సాగుతున్నారాయన. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం రోగ్. మరో చంటిగాడి ప్రేమకథ ఉపశీర్షిక. ఇషాన్, ఏంజెలా, మన్నారా చోప్రా ప్రధాన పాత్రలను పోషించారు. డా॥ సి.ఆర్ మనోహర్, సి.ఆర్. గోపి నిర్మించారు. ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో పూరి జగన్నాథ్ పాత్రికేయులతో ముచ్చటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here