తెలంగాణ సీఎస్, సింగరేణి కాలరీస్‌పై జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఆగ్రహం

0
8

తెలంగాణ సీఎస్, సింగరేణి కాలరీస్‌పై జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. జయశంకర్ జిల్లాలో కాకతీయ గని-2లో పర్యావరణ అనుమతులను ఉల్లంఘిస్తున్నారని దాఖలైన పిటిషన్‌పై బుధవారం ఎన్జీటీలో విచారణ జరిగింది. దీనిని పరిశీలించిన ధర్మాసనం.. కౌంటర్ దాఖలు చేయాలని రెండుసార్లు గడువు ఇచ్చినా ఎందుకు కౌంటర్ వేయలేదని మండిపడింది. రేపటి లోపు కౌంటర్ దాఖలు చేయకపోతే రూ.50 వేల చొప్పున జరిమానా చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించింది. సమగ్ర వివరణ ఇవ్వడంలో ఆలస్యమైందని సింగరేణి తరఫు లాయర్ ఎన్జీటీ ధర్మాసనానికి వివరించారు. దీంతో రెండు వారాల్లోపు రాతపూర్వక వాద, ప్రతివాదనలు పూర్తి కావాలని ఎన్జీటీ ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను జులై 13కి వాయిదా వేసింది.

LEAVE A REPLY