తెలంగాణ సమాజంలో ఏకీకరణ జరుగుతున్నది

0
14

తెలంగాణ:దేశంలోని సమస్యల శాశ్వత పరిష్కారానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆలోచనచేస్తుంటే.. ప్రధాని నరేంద్రమోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మాత్రం పదవుల గురించి ఆలోచిస్తున్నారని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు విమర్శించారు. కేసీఆర్ ఆలోచనలే దేశానికి ఆచరణగా మారాయని చెప్పారు. మోదీ వేడి తగ్గిందని, కాంగ్రెస్ గాడి తప్పిందని ఎద్దేవాచేశారు. రాష్ట్రంలో ఒకవేళ కాంగ్రెస్ ఎంపీలు గెలిస్తే రాహుల్ ప్రయోజనాలకు, బీజేపీ ఎంపీలు గెలిస్తే నరేంద్రమోదీ ప్రయోజనాలకు పనిచేస్తారన్న కేటీఆర్.. టీఆర్‌ఎస్ ఎంపీలు గెలిస్తే తెలంగాణ ప్రయోజనాలకోసమే పనిచేస్తారని చెప్పారు. బుధవారం తెలంగాణభవన్‌లో బోథ్ నియోజకవర్గానికి చెందిన అనిల్‌జాదవ్, నకిరేకల్ ఎమ్మెల్యే కుమారుడు చిరుమర్తి మనోజ్‌కుమార్, తుంగతుర్తి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ సహా వివిధ పార్టీలకు చెందిన నాయకులు కేటీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here