తెలంగాణ రాష్ట్రంలో ముస్లింల అభివృద్ధి

0
3

తెలంగాణ రాష్ట్రంలో ముస్లింల అభివృద్ధికి ప్రభుత్వం కోట్లాది రూపాయలను కేటాయించిందని రవాణ శాఖ మంత్రి మహేందర్‌ రెడ్డి తెలిపారు. వికారాబాద్‌ లో పేద ముస్లింలకు ప్రభుత్వం ఇస్తున్న రంజాన్‌ బహుమతిని మహేందర్ రెడ్డి అందజేశారు. కొత్తబట్టలతో పాటు ఇఫ్తార్‌ విందుల ఏర్పాటుకు నిధులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జిల్లాలో 10 వేల మంది పేద ముస్లింలకు దుస్తుల కిట్స్‌ ను అందజేస్తున్నామన్నారు. ఇఫ్తార్‌ దావత్‌ ల కోసం జిల్లాకు ఐదు లక్షల రుపాయల నిధులను కేటాయించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజీవరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొండల్ రెడ్డి, జడ్పీటీసీ షరీఫ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రామచంద్రారెడ్డి, శుభప్రద్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY