తెలంగాణ – మహారాష్ట్రలను కలిపే కాళేశ్వరం- సిరోంచ వారథి ప్రారంభమైంది

0
27

కాళేశ్వరం: తెలంగాణ – మహారాష్ట్రలను కలిపే కాళేశ్వరం- సిరోంచ వారథి ప్రారంభమైంది. మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు ముఖ్య అతిధిగా విచ్చేసి గోదావరిపై వంతెనను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మహారాష్ర్ట సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఆ రాష్ర్ట రవాణాశాఖ మంత్రి అశోక్ నేతేతోపాటు కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ, రాష్ర్ట మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తదితరులు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా (పూర్వ కరీంనగర్) మహదేవపూర్ మండలం కాళేశ్వరం వద్దనున్న గోదావరి నదిపై 1620 మీటర్ల పొడవున్న ఈ వారథి నిర్మాణాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కేంద్రప్రభుత్వం రూ. 242 కోట్లు ఖర్చుచేసింది. 2011లో ప్రారంభమైన ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తికావడంతో.. ఇక రెండు రాష్ర్టాలకు రాకపోకలు మరింత మెరుగుపడనున్నాయి

LEAVE A REPLY