తెలంగాణ నా జన్మభూమి.. మహారాష్ట్ర నా కర్మభూమి

0
21

కాళేశ్వరం: తెలంగాణ జన్మభూమి అని మహారాష్ట్ర తన కర్మభూమి అని మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు అన్నారు. కాళేశ్వరం-మహారాష్ట్రలోని సిరోంచ మధ్య గోదావరి నదిపై నిర్మించిన వంతెనను నేడు ఆయన ముఖ్యఅతిధిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ.. రెండు రాష్ర్టాల మధ్య వారధి నిర్మాణం ఎంతో ఆనందాన్ని ఇస్తుందని తెలిపారు. వారథి నిర్మాణం కొత్త సంవత్సర కానుకగా భావిస్తున్నామన్నారు. వంతెన నిర్మాణంతో ఇరు రాష్ర్టాల మధ్య ప్రయాణభారం తగ్గనున్నట్లు వెల్లడించారు. ఆదివాసీల స్వావలంభన కోసం మహారాష్ట్ర ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందన్నారు. గిరిజనులు జనజీవన స్రవంతిలో కలిసి రాష్ర్టాభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు.

LEAVE A REPLY