తెలంగాణ ఆలోచన.. దేశానికి ఆచరణ

0
19

తెలంగాణ ప్రభుత్వం ఇవాళ ఏం ఆలోచిస్తున్నదో.. రేపు భారతదేశం అంతా అదే ఆచరిస్తుందని రాష్ట్ర ఐటీ, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రతి పని దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నదని తెలిపారు. ఐటీ రంగంలో రాజధాని హైదరాబాద్ మేటిగా మారుతున్నదని చెప్పారు. గడిచిన నాలుగేండ్లలో గణనీయమైన అభివృద్ధి సాధించిన ఐటీ రంగాన్ని హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో మరింత విస్తరించనున్నామని వెల్లడించారు. త్వరలోనే బుద్వేల్-కిస్మత్‌పూర్ మధ్యన 350 ఎకరాల స్థలంలో 28 కంపెనీలు రాబోతున్నాయని మంత్రి కేటీఆర్ ప్రకటించారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here