తెలంగాణా లో టీడీపీ – కాంగ్రెస్ పొత్తు ?

0
76

తెలంగాణా ప్రాంతం లో టీడీపీ పార్టీ తో పొత్తు గురించి అడిగితే డౌట్ అని చెప్పిన అమిత్ షా వ్యాఖ్యలు టీడీపీ భవిష్యత్తు ని తెలంగాణా ప్రాంతం లో ప్రశ్నించేలా చేస్తున్నాయి. ఆంధ్రాలో టీడీపీతో కలిసి పయనిస్తామని చెబుతూనే. తెలంగాణలో పొత్తు ఉండదని స్పష్టమైన సంకేతాలే ఇచ్చేశారు. దీంతో టి.టీడీపీకి ప్రత్యామ్నాయం వెతుక్కోవాల్సిన అవసరం ఏర్పడింది. కేసీఆర్ ను గద్దెదింపేందుకు కాంగ్రెస్ తోపాటు వామపక్షాలతో కలిసి రంగంలోకి దిగేందుకు తెలుగుదేశం సిద్ధంగా ఉందని రేవంత్ రెడ్డి చెబుతున్నారు.

అమిత్ షా వ్యాఖ్యలపై తాజాగా ఆయన స్పందించారు. తెలంగాణలో తెలుగుదేశంతో పొత్తు వద్దని వారు అనుకుంటే, వారితో కలిసి ముందుకు సాగేందుకు టీడీపీ కూడా సిద్ధంగా లేదని రేవంత్ స్పష్టం చేశారు. పేదలకు మేలు చేయడం కోసం, రాజకీయ శక్తుల పునరేకీకరణ జరుగుతుందన్నారు.కాంగ్రెస్ తో కలిసి ముందుకు సాగే అంశమై తొందరపడొద్దని ఈ మధ్య చంద్రబాబు చెప్పినా కూడా, రేవంత్ మరోసారి ఇదే టాపిక్ తెర మీదికి తెచ్చారు.

కాంగ్రెస్ తో కలిసేందుకు టీటీడీపీ సిద్ధంగా ఉందని రేవంత్ మరోసారి స్పష్టం చేసినట్టయింది. అయితే, టీడీపీ సిద్ధంగా ఉన్నా. కాంగ్రెస్ మాటేంటి అనేదే ఇప్పుడు అసలు ప్రశ్న..? ఎందుకంటే, తెలంగాణలో కాంగ్రెస్ నెమ్మదిగా పుంజుకుంటోందని ఇటీవలే కొన్ని సర్వేలు చెప్పాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here