తెలంగాణకు ఆరు పద్మాలు

0
20

ప్రజలకు, దేశానికి సేవ చేస్తూ ప్రచారానికి దూరంగా ఉన్న వ్యక్తులను కేంద్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకమైన పద్మ పురస్కారాలకు ఎంపిక చేసింది. కేంద్రప్రభుత్వం బుధవారం ప్రకటించిన పద్మ పురస్కార గ్రహీతల్లో ఈసారి దాదాపు సగం మంది స్థానికంగానే తప్ప ఇతర ప్రాంతాలకు తెలియనివారే. ఎంపికైనవారిలో 19 మంది మహిళలు, ఐదుగురు విదేశీయులు, ప్రవాస భారతీయులు ఉన్నారు. ఆరుగురికి మరణానంతరం అవార్డులను ప్రకటిం చారు. చెట్ల పెంపకాన్ని ఉద్యమంగా చేపట్టి, దానికి జీవితాన్ని అంకితం చేసిన తెలంగాణకు చెందిన వనజీవి దరిపల్లి రామయ్య, పోచంపల్లి పట్టుచీరలను నేయటానికి అవసరమైన సమయా న్ని, శారీరకశ్రమను తగ్గించే లక్ష్మీ ఆసు యంత్రాన్ని రూపొం దించిన తెలంగాణ చేనేత కళాకారుడు చింతకింది మల్లేశం, పేదలకు గత 68 ఏండ్లుగా ఉచితంగా వైద్యసేవలు అందిస్తున్న మధ్యప్రదేశ్‌కు చెందిన డాక్టర్ దీదీ, భారత్ అంధుల క్రికెట్ జట్టు కెప్టెన్ శేఖర్‌నాయక్, కన్నడ జానపద సంగీత కళాకారు డు సుక్రి బొమ్మగౌడ, అసోంలో గత 47 ఏండ్లుగా మహిళల కోసం ప్రత్యేకంగా ఒక మ్యాగజైన్‌ను నిర్వహిస్తున్న ఈలా అహ్మద్, 70ఏండ్లుగా కేరళ యుద్ధకళ కలరిపయట్టును అభ్య సిస్తూ కొత్తతరాలకు నేర్పిస్తున్న మీనాక్షి అమ్మ తదితరులు న్నారు. వీరందరూ పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు.

 

ఏడుగురికి పద్మవిభూషణ్

రెండో అత్యున్నత పౌరపురస్కారమైన పద్మవిభూషణ్‌కు రాజకీయ కురువృద్ధులు మురళీమనోహర్‌జోషి, శరద్‌పవార్, లోక్‌సభ మాజీస్పీకర్, దివంగత నేత పీఏ సంగ్మా, మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత సుందర్‌లాల్ పట్వా ఉన్నారు. కేరళకు చెందిన ప్రసిద్ధ గాయకుడు ఏసుదాస్, ఇస్రో మాజీ చైర్మన్ ప్రొఫెసర్ ఉడిపి రామ చంద్రరావు, ఆధ్యాత్మిక వేత్త జగ్గీ వాసుదేవ్‌ను కూడా పద్మవిభూషణ్ పురస్కారం వరించింది. పద్మభూషణ్ అవార్డుకు ఎంపికైనవారిలో యోగా గురువు స్వామి నిరంజనానంద సరస్వతి, మనదేశంలో లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్స పితామహుడిగా పేరొందిన తెహెమ్టన్ ఉద్వాదియా, హిందుస్థానీ సంగీత విద్వాంసుడు, గ్రామీ అవార్డు విజేత విశ్వమోహన్‌భట్, థాయ్‌లాండ్ యువరాణి మహాచక్రి సిరింధ్రోన్, సంస్కృత పండితుడు దేవీప్రసాద్ ద్వివేది, జైనమతానికి చెందిన ఆధ్యాత్మికవేత్త గురురత్నసుందర్ మహారాజ్, తమిళ ఎడిటర్, దివంగతచో రామస్వామి ఉన్నారు. పౌర పురస్కారాల్లో అత్యున్నతమైన భారతరత్నకు ఈసారి ఎవరినీ ఎంపిక చేయలేదు. పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన వారిలో టీమిండియా కెప్టెన్ విరాట్‌కోహ్లీ, రెజ్లింగ్ (కుస్తీ)లో ఒలింపిక్ పతకం గెలిచిన సాక్షి మాలిక్, గాయకుడు కైలాశ్ ఖేర్, సినిమా విమర్శకురాలు భావన సోమయ్య, ఆరున్నర దశాబ్దాలుగా ఉచిత వైద్యసేవలు అందిస్తున్న మధ్యప్రదేశ్‌కు చెందిన భక్తియాదవ్, ఫార్సీ రచయిత కేఎన్ పండిత, ఫ్రాన్స్ మూలాలున్న భారతీయచరిత్రకారుడు మైఖేల్ డేనినో తదితరులున్నారు. డాక్టర్ సునీతి సాల్మాన్‌కు మరణానంతరం ప్రకటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here