తృటిలో త‌ప్పిన విమాన ప్ర‌మాదం

0
20

శాన్‌ఫ్రాన్సిస్‌కో: అమెరికాలో భారీ విమాన ప్ర‌మాదం త‌ప్పింది. శాన్‌ఫ్రాన్సిస్‌కో విమానాశ్ర‌యంలో కెన‌డాకు చెందిన విమాన ల్యాండింగ్ అంద‌ర్నీ క‌ల‌వ‌ర‌పెట్టింది. 140 మంది ప్ర‌యాణికుల‌తో ల్యాండింగ్ చేస్తున్న స‌మ‌యంలో అక్క‌డే ఆగి ఉన్న విమానాల‌కు చేరువుగా కెన‌డా విమానం ఎగిరింది. కేవ‌లం 30 మీటర్ల ఎత్తు నుంచి రెండు విమానాల‌ను త‌ప్పించుకున్న‌ది. ఈ ఘ‌ట‌న ఈనెల 7న జ‌రిగింది. ర‌న్‌వేపై దిగాల‌నుకున్న కెన‌డా విమానం అక‌స్మాత్తుగా టాక్సీవేకు ద‌గ్గ‌ర‌గా వ‌చ్చింది. అయితే టాక్సీవేపై నాలుగు విమానాలు పార్క్ చేసి ఉన్నాయి. మొద‌టి రెండు విమానాల‌కు కేవ‌లం 30 మీట‌ర్ల ఎత్తు నుంచే కెన‌డా విమానం వెళ్లింది. ఏటీసీ అధికారులు కెన‌డా విమాన పైలెట్‌ను అల‌ర్ట్ చేయ‌డంతో అత‌ను విమానాన్ని పైకిలేపాడు. అలా పైకి తీసుకెళ్ల‌డం వ‌ల్ల పార్క్ చేసిన మిగ‌తా రెండు విమానాల‌కు దూరంగా కెన‌డా విమానం వెళ్లింది. మ‌ళ్లీ రౌండ్ కొట్టిన విమానం ఆ త‌ర్వాత సేఫ్‌గా ల్యాండ్ అయ్యింది. ఈ ఘ‌ట‌న‌లో ప్ర‌యాణికుల‌కు ఎటువంటి గాయాలు కాలేదు. విమానాశ్ర‌య అధికారులు ఈ ఘ‌ట‌న ప‌ట్ల విచార‌ణ చేప‌ట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here