తాగి వాహనం నడుపుతూ దొరికిన నటుడు

0
16

జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌లోని పలుచోట్ల శనివారం రాత్రి నిర్వహించిన డ్రంకెన్‌ డ్రైవ్‌లో తనిఖీల్లో పలువురిపై కేసులు నమోదు చేశారు. రోడ్డు నం. 10లో నిర్వహించిన తనిఖీలో ‘ఉయ్యాలా జంపాలా’ ఫేమ్‌ కిరీటి దామరాజు మద్యం తాగి కారు నడుపుతుండగా పోలీసులు నిలువరించి, అతనికి శ్వాసపరీక్షలు చేశారు. రక్తంలో ఆల్కహాల్‌ లెవెల్‌ 36గా రావడంతో కారును స్వాధీనం చేసుకుని కేసును నమోదు చేశారు. మరో వైపు జూబ్లీహిల్స్‌ రోడ్డు నం.45 ప్రాంతంలో తనిఖీలు నిర్వహిస్తున్న ట్రాఫిక్‌ సిబ్బందికి మద్యం మత్తులో కారు నడుపుతున్న యువతి చిక్కినట్లే చిక్కి తప్పించుకుంది. పోలీసులు కారు ఆపగానే వెంటనే సమీపంలోని ఏటీఎం కేంద్రంలోకి వెళ్లి టీషర్టు మార్చుకుని, వేరేవాళ్లు కారు నడిపారంటూ బుకాయించింది. దీంతో కారునడిపింది మద్యం మత్తులో ఉన్న యువతేనని పోలీసులు నిర్ధారించలేక వదిలేశారు. శనివారం మొత్తం 20 వాహనదారులపై కేసులు నమోదు చేసినట్లు ట్రాఫిక్‌ సిబ్బంది చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here