తాగడం మానేశా..

0
18

తమిళ ప్రముఖ దర్శకుడు ఎ.ఆర్‌. మురుగదాస్‌ మూడేళ్లుగా బహుళజాతి కంపెనీలకు చెందిన శీతల పానీయాలను తాగడాన్ని మానేశారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. మురుగదాస్‌ దర్శకత్వంలో ‘కత్తి’ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో శీతలపానీయాల తయారీ వల్ల గ్రామాల్లోని నీటి వనరులు కలుషితం అవుతున్న కథాంశాన్ని చర్చించారు. మురుగదాస్‌ ఈ కథను కమర్షియల్‌ హిట్‌ కోసమే రాయకుండా, హృదయానికి దగ్గర చేసుకున్నారు. అందుకే ‘కత్తి’ చిత్రం కథను రాస్తున్నప్పుడే తాగడం మానేశారట.

‘మూడేళ్ల కిత్రం ‘కత్తి’ సినిమా కథ రాస్తున్నప్పుడు వీటిని తాగడం మానేశా. ఇప్పుడు నా షూటింగ్‌ స్పాట్‌లో కూడా నిషేధించాం’ అని మురుగదాస్‌ ట్వీట్‌ చేశారు. సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు హీరోగా మురుగదాస్‌ తెరకెక్కిస్తున్న చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం జరుగుతోంది. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ ఇందులో కథానాయికగా నటిస్తున్నారు.

LEAVE A REPLY