తమిళనాడు సీఎంగా పన్నీరు సెల్వం

0
26

చెన్నై: తమిళనాడు సీఎంగా పన్నీరు సెల్వం సోమవారం అర్ధరాత్రి ప్రమాణ స్వీకారం చేశారు. చెన్నైలోని రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకార కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ ప్రజా హృదయనేత మరణం తీరని లోటు అన్నారు. ఈ కార్యక్రమానికి ముందు శాసనసభా పక్షం రెండు నిమిషాల పాటు మౌనం పాటించింది.

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గుండెపోటుతో కన్నుమూయడంతో ఆమెస్థానంలో ముఖ్యమంత్రిగా అన్నాడీఎంకే నాయకుడు, మంత్రి పన్నీరు సెల్వంను ఎన్నుకున్నారు. ఈ విషయాన్ని అన్నాడీఎంకే అధికారికంగా ప్రకటించింది. జయలలితకు అత్యంత విధేయుడిగా పన్నీరు సెల్వంకు పేరుంది. క్లిష్టసమయాల్లో కూడా ఆమె ఆయన్ను విశ్వాసంలోకి తీసుకునేవారు. గతంలో కూడా జయలలిత ముఖ్యమంత్రి బాధ్యతల నుంచి తప్పుకొన్నప్పుడు ఆయనే ఈ బాధ్యతలను నిర్వహించారు. సోమవారం రాత్రి జరిగిన అన్నాడీఎంకే సమావేశంలో ఆయన్ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here