తమిళనాడు పీఠంపై శశికళ!

0
16

తమిళనాట రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఏఐడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ ముఖ్యమంత్రి పీఠం ఎక్కేదిశగా పరిణామాలు వేగంగా సాగుతున్నాయి. ముఖ్యమంత్రి కార్యాలయంలో, పార్టీ పదవుల్లో రెండు రోజులుగా అనూహ్య మార్పులు జరుగుతుండటం ఈ వాదనలకు మరింత బలం చేకూర్చుతున్నది. ఆదివారం చెన్నైలో పార్టీ ఎమ్మెల్యేల సమావేశం జరుగనున్నట్టు ఏఐడీఎంకే అధికార ప్రతినిధి సీఆర్ సరస్వతి మీడియాకు తెలిపారు. శశికళ సీఎం పదవి చేపట్టాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యేలంతా కోరవచ్చునని తెలుస్తున్నది. వారంతా ఆమెను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోనున్నట్టు సమాచారం. ఈ మేరకు సీఎం పన్నీరు సెల్వంను తొలగించి సోమవారం శశికళ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించవచ్చునని తెలుస్తున్నది.

అయితే కొందరు సీనియర్ నాయకులు మాత్రం ఇవన్నీ ఊహాత్మక కథనాలంటూ కొట్టిపారేస్తున్నారు. జయలలిత మరణించినప్పటి నుంచే శశికళ పార్టీ పగ్గాలతోపాటు ముఖ్యమంత్రి పీఠం ఎక్కాలనే డిమాండ్లు బలంగా వినిపించాయి. లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ ఎం తంబిదురై బహిరంగంగానే పార్టీ బాధ్యతలు, సీఎం పదవి ఒకరి చేతుల్లోనే ఉండాలని, శశికళ సీఎం పదవి చేపట్టాలని కోరారు. నలుగురు రాష్ట్రమంత్రులు సైతం శశికళ సీఎం కావాలని డిమాండ్ చేశారు.

LEAVE A REPLY