తమిళనాడులో బీభత్సం ఏడుగురు మృతి

0
26

గత రెండు దశాబ్దాలలో ఎన్నడూ రానటువంటి అతి తీవ్ర తుఫాన్ వార్ధా సోమవారం సాయంత్రం చెన్నైకి సమీపంలో తీరాన్ని తాకింది. అది సృష్టించిన పెను బీభత్సానికి చెన్నై నగరం చిగురుటాకులా వణికిపోయింది. వంద నుంచి 120 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురుగాలులు, భారీ వర్షాలతో తమిళనాడులోని మూడు జిల్లాలు, ఆంధ్రప్రదేశ్‌లోని రెండు జిల్లాలు అతలాకుతలమయ్యాయి. తమిళనాడులో వేర్వేరు ఘటనల్లో ఏడుగురు మరణించగా, వందల కోట్ల రూపాయల విలువైన ఆస్తి నష్టం సంభవించింది. రోడ్డు రవాణా, రైళ్లు, విమానాల రాకపోకలు నిలిచిపోయాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here