తదుపరి దెబ్బ బంగారం నిల్వలపైనేనా !

0
23
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హిట్‌ లిస్ట్‌లో పెద్ద నోట్ల రద్దు నిర్ణయం బయటికొచ్చింది. ఇంతటితో ఆగేది లేదని ఆయన ఇటీవల చెప్పిన నేపథ్యంలో తదుపరి దెబ్బ బంగారం నిల్వలపైనేనని సమాచారం వస్తోంది. గృహ వినియోగం కోసం నిల్వ ఉంచుకునే బంగారంపై ఆంక్షలు విధించాలని మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు ఓ వార్తా సంస్థ తెలిపింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలో ఓ అధికారి ఈ విషయం చెప్పారని పేర్కొంది. అయితే ఆర్థిక మంత్రిత్వ శాఖను సంప్రదించినపుడు దీనిపై స్పందించేందుకు నిరాకరించారు.
బంగారం దిగుమతులపై ఆంక్షలు విధించే అవకాశం ఉందన్న భయంతో ఆభరణాల వ్యాపారులు గత వారం భారీగా బంగారాన్ని దిగుమతి చేసుకున్నారు. రెండేళ్ళ గరిష్ఠ స్థాయికి బంగారం దిగుమతి అయింది. రూ.500, రూ.1,000 కరెన్సీ నోట్ల రద్దు నిర్ణయం తర్వాత బంగారంపై ఆంక్షలు విధించే అవకాశం ఉందన్న ఆందోళనతో వ్యాపారులు ఈ స్థాయిలో బంగారాన్ని దిగుమతి చేసుకున్నారు.

LEAVE A REPLY